హైదరాబాద్ ప్రజలకు ముఖ్య సూచన

67

2020 చాలామంది జీవితాలను పీల్చిప్పిచేసింది. ప్రపంచ దేశాలపై కరోనా వైరస్ దండయాత్ర చెయ్యడంతో ఇంకా పదేళ్లు బ్రతుకుతం అనుకోని ధీమాగా ఉన్నవారు కూడా కరోనా దెబ్బకు కాలం చేశారు.. ఈ మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా అరకోటికి మందికిపైనే ప్రజలు మృతి చెందారు. ఇక ఎంతోమంది ఈ మహమ్మారి బారినపడ్డారు. ఈ చేదు అనుభవాలు, జ్ఞాపకాలతో ప్రజలు 2021 లో అడుగు పెడుతున్నారు.

అయితే ఇంకా కరోనా తగ్గకపోవడం. మరోవైపు కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చాలా దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలను నిషేదించారు. న్యూ ఇయర్ సంబరాల వలన కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో కూడా న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. పబ్స్‌, రిసార్టులు, హోటళ్లపై పటిష్ట నిఘా ఉంటుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గేటెడ్‌ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్‌ కాలనీల్లోనూ వేడుకలు నిషిద్ధమని తెలిపారు. . ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు కూడా చేస్తామని ముందుగానే తెలియజేశారు.

మద్యం తాగి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరోనా కొత్త వైరస్ వస్తుంది అనే విషయాన్నీ ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. ఇప్పటి పరిస్థితులు గతంలోలా లేవని, ఎవరు కూడా పోలీస్ వారి ఆదేశాలను దిక్కరించకూడదని తెలిపారు. టపాసులు కాల్చడం కూడా నిషేధమని సీపీ వివరించారు.

హైదరాబాద్ ప్రజలకు ముఖ్య సూచన