తెలంగాణలో 10 శాతం EWS రిజర్వేషన్ల అమలు

438

తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ గుడ్ న్యూస్ చెప్పారు. 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణలో
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలులో ఉండగా.. తాజాగా 10శాతం EWS రిజర్వేషన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 60 శాతం రిజర్వేషన్లు కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై సీఎం కేసీఆర్‌ రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించనున్నారని సీఎంఓ కార్యాలయం వెల్లడించింది.