CM KCR : కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు :- వివేక్

205

గత కొద్దీ రోజులుగా తెలంగాణలో బీజేపీ vs టీఆర్ఎస్ వార్ నడుస్తుంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు దూకుడు పెంచి అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మంగళవారం మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ వివేక్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్‌ను చేతిలోకి తీసుకున్నారని మండిపడ్డారు. రామ మందిర నిర్మాణంపై టీఆర్ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

వారిపై పోలీసులు కేసులు నమోదు చెయ్యడం లేదని వివేక్ అన్నారు. రామ మందిర నిర్మాణంలో అన్ని వర్గాల మద్దతు ఉండాలనే ఉద్దేశంతోనే అందరిని భాగస్వామ్యం చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు రామమందిరాన్ని రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులను అరెస్టు చేసి దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయకపోవడం కేసీఆర్ కుట్రలో భాగమని ఎంపీ తెలిపారు.

దాడులకు పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయకుంటే ఆందోళన చేస్తామని అన్నారు. రామమందిర నిర్మాణం నిధుల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌లు రామ భక్తులకు వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కలిసికట్టుగా చెయ్యాల్సిన కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్దతి కాదని, రాముడంటే అందరి దేవుడని అన్నారు.

CM KCR : కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు :- వివేక్