వరినాట్లు వేసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి

158

ఓ ప్రభుత్వ అధికారిని బురదపోలంలోకి దిగి నాట్లు వేసింది. విధుల్లో బిజీ బిజీగా ఉండే ఫారెస్ట్ అధికారిని పొలంలోకి దిగింది. రైతు కూలీలతో కలిసి పావుగంట పాటు వరినాట్లు వేసింది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మన్నెగూడం ప్రధాన రహదారి పక్క పొలంలో వరినాట్లు వేస్తున్నారు కూలీలు. మన్నెగూడం. కోనంపేట అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్లారు ఐఎఫ్ఎస్ అధికారిని లావణ్య, తిరుగుప్రయాణంలో మన్నెగూడెం వద్ద వరినాట్లు వేస్తున్నవారిని చూసి వాహనం నిలిపారు.

పొలంలోకి దిగి వరినారు చేతబట్టి నాటు వేయసాగారు. ఈ నేపథ్యంలోనే కూలీలతో ముచ్చటించారు. ఒకరోజు నాటు వేస్తె ఎంత కూలి ఇస్తారో అడిగి తెలుస్తుకున్నారు. ఒక ఎకరా నాటు వెయ్యాలి అంటే ఎంతమంది కూలీలు అవసరమవుతారని తెలుసుకున్నారు. 15 నిముషాలు నాటు వేసి అనంతరం కార్యాలయానికి వెళ్లారు

వరినాట్లు వేసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి