ఇంట్లో మద్యం పెట్టుకోవాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి

165

మద్యం ఇంట్లో పెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలంట.. ఇది మందుబాబులకు ఒకింత చేదువార్తే. ఈ కొత్త విధానానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై ఇంట్లో ఓ మోతాదుకు మించి మద్యం నిల్వ చేసుకోవాలి అంటే తప్పనిసరి ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలట. లిక్కర్ నుంచి ఆదాయం పెంచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో ఆరు లీటర్లకంటే ఎక్కువ మద్యం నిల్వ చెయ్యాలి అనుకుంటే రూ.12 వేలు పెట్టి లైసెన్స్ తీసుకోవాలి ఈ లైసెన్స్ ఏడాది పాటు చెల్లుతుంది.

ఇంకో విషయం రూ. 51 వేలు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాలట. అయితే మందుబాబులు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రతిసారి షాపుకు వెళ్లలేని కొందరు నెలకు సరిపడా సరుకులు తెచుకున్నట్లుగానే మద్యం కూడా తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకునే వారికీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం గుదిబండలా మారనుంది. ఇక ఈ ఏడాది మొత్తం ఆరువేలకోట్ల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందట. ఈ నేపథ్యంలోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది.

ఇంట్లో మద్యం పెట్టుకోవాలి అంటే లైసెన్స్ తీసుకోవాలి