కోహ్లీనే నంబర్ వన్.. రోహిత్ 2

89

2020 ఏడాది ముగింపు సందర్బంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఈ ఏడాది నంబర్ వన్ ఆటగాడిగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచారు. కోహ్లీ 870 పాయింట్లతో అగ్రస్థానం సాధించగా రోహిత్ శర్మ842 పాయింట్స్ తో రెండవస్థానంలో నిలిచారు.

పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజమ్ 837 పాయింట్స్ తో మూడో స్థానంలో నిలవగా టేలర్ 818, ఆరోన్ ఫించ్ 791 పాయింట్స్ తో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక ఆసీస్‌ టూర్‌లో మంచి బ్యాటింగ్ ప్రతిభ కనబరిచిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్‌లో కెరీర్‌ బెస్ట్‌ చేరుకున్నాడు.

ఇక బౌలింగ్‌ విభాగానికి వస్తే న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్‌ బౌలర్‌ ముజీబుర్‌ రెహమాన్‌ 701 పాయింట్లతో రెండో స్థానం.. టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో టాప్‌ 10లో బుమ్రా మినహా టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌ కూడా లేరు.

 

కోహ్లీనే నంబర్ వన్.. రోహిత్ 2