ఏపీకి ఐఏఎస్ శ్రీలక్ష్మి.. ఎట్టకేలకు ఊరట

97

ఐఏఎస్ శ్రీలక్ష్మికు ఊరట లభించింది. తనను ఏపీ క్యాడర్ కు బదిలీ చేయాలంటూ ఆమె చేసిన విన్నపాన్ని క్యాట్ ఆమోదించింది. శుక్రవారం ఐఏఎస్ శ్రీలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. దాంతో ఆమె నిన్న సాయంత్రమే ఏపీ క్యాడర్ కు డెప్యూటేషన్ అయ్యారు. ఏపీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో రిపోర్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీలక్ష్మి.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ క్యాడర్ లో ఉండిపోవాల్సివచ్చింది.

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తనను ఏపీ క్యాడర్ కు బదిలీ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆమెను రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. కేంద్రం మాత్రం సుముఖంగా లేకపోవడంతో ఆమె క్యాట్ ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారించిన క్యాట్.. ఏపీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో స్వరాష్ట్రానికి వెళ్లాలన్న శ్రీలక్ష్మి కోరిక నెరవేరడం తోపాటు జగన్ ప్రభుత్వంలో కీలకం అయ్యే అవకాశం ఉంది.