8 మంది మహిళలను దుబాయ్ షేక్‌లకు అమ్మిన హైదరాబాధీ

114

ఉద్యోగం పేరిట మహిళలను మోసం చేసిన కేసు హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ సిటీకి చెందిన 8 మంది మహిళలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. నగరానికి చెందిన మహ్మద్ షఫీ అనే వ్యక్తి యుఎఇలో ఉద్యోగం పేరిట మహిళలను అరబ్ షేక్ కుటుంబాలకు అమ్మారు. అయితే మహిళల గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో హైదరాబాద్ లోని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..

విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు షఫీని అరెస్టు చేశారు. మరోవైపు తమను విడిపించాలంటూ అమ్రీన్ బేగం, నాజియా బేగం, యస్మీన్ బేగం, రహీమా బేగం, కనీజ్ ఫాతిమా, మెహ్రూనిసా బేగం, ఆసం బేగం, జరీనా బేగం అనే ఎనిమిది మంది మహిళల కుటుంబం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాశారు.