60 ఏళ్ల దొంగను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

66

దొంగంటే యంగ్ గా ఉండాల్సిన పనిలేదు. దొంగతనంలో ప్రావీణ్యం ఉంటే వయసుతో పనేముంది, రిటైర్మెంట్ కాడానికి ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు. పని సరిగా చెయ్యడం లేదని తీసేయడానికి ప్రైవేట్ నౌకరి అసలే కాదు. అందుకే 6 పదుల వయసులో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఓ వ్యక్తి. ఆ ఘరానా దొంగ ఉన్న ముఠాని హైదరాబాద్ పోలీసులు పట్టుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ ముఠాలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా 60 ఏళ్ల శంకర్ నిలిచాడు. ఈ శంకర్ అలాంటి ఇలాంటి దొంగకాదు ఏకంగా 250 దొంగతనం కేసులు ఉన్న దొంగ. నాలుగు సార్లు పీడీయాక్ట్ కింద జైలుకు వెళ్ళివచ్చాడు. అయినా బుద్దిరాలే, ఈజీ మనీకి అలవాటుపడిన శంకర్ దొంగల ముఠాతో కలిసి అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు.

ఇక ముసలోడైనా అనుభవం ఉన్న దొంగ కావడంతో ముఠా కూడా ఆయనను పక్కకు పెట్టలేక పోతుంది. నగరంలో గూగుల్ మ్యాప్ కంటే శంకర్ మైండ్ మ్యాప్ కరెక్ట్ గా ఉంటుందంట. డబ్బులున్న ఇల్లుని యిట్టె పసిగడతాడట, అందుకే 60 ఏళ్ల దొంగను వదలడం లేదు ముఠా. ఇక ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు శంకర్ ని అదుపులోకి తీసుకున్నారు. మరి ఎన్నిరోజులు శిక్ష పడతదో చూడాలి.

ఇక సీనియర్ దొంగను పట్టుకున్న పోలీసులు ఆయన గురించి వివరాలు చెబుతుంటే అమ్మ దొంగ అంటున్నారు ప్రజలు. ఈ దొంగ మాములు దొంగ కాదు 250 కేసులు ఉండి కూడా ఇంకా దొంగతనాలు చేస్తున్నాడు అంటే అతడికి ఎంత ధైర్యమో అని అనుకుంటున్నారు.

60 ఏళ్ల దొంగను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు