Hyderabad Old City: కత్తులు, తల్వార్లతో అర్ధరాత్రి వీరంగం!

157

Hyderabad Old City: కొంత కాలంగా రాజధాని హైదరాబాద్ నగరంలో అల్లర్లు, గొడవలు లేకుండా ప్రశా౦తత నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో అల్లర్లు అనగానే ముందుగా వినిపించే పేరు పాతబస్తి. ఓల్డ్ సిటీలో అల్లర్లకు ఎక్కువ అవకాశం ఉంటుందని పేరు ఉండేది. ఈ మధ్య కాలంలో ఆ పరిస్థితి మరుగునపడి౦ది. కానీ గురువారం అర్ధరాత్రి పాతబస్తీలో ఆకతాయిలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. నానా బీభత్సం సృష్టించారు. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తులు, తల్వార్లతో వీరంగం చేశారు. ఇప్పటికే పలు నేరాలకు పాల్పడిన రౌడీషీటర్‌ ఖోనిగౌస్‌.. గురువారం రాత్రి తన ముఠాతో కలిసి సులేమాన్‌నగర్‌లో ఐదు ఇళ్లపై దాడిచేశాడు. కత్తులు, తల్వార్లతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమవగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో సాలార్‌జంగ్‌ మ్యూజియంలో టిఫిన్‌ బాక్సును గౌస్‌ చోరీ చేశాడు.