నగరంలో నయా దొంగలు.. ఆదమరిస్తే అంతే సంగతులు

109

హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు తాళాలు పగలగొట్టి సొత్తు దోచుకెళ్లే దొంగలను చూశాము. బైక్ పై వచ్చి స్నాచింగ్ చేసే దొంగలను చూశాము. కానీ ప్రస్తుతం నగరంలో కొత్త రకం దొంగలు తయారయ్యారు. ఏకంగా కుటుంబాలకు కుటుంబాలే దొంగలుగా మారి అనుమానం రాకుండా దొంగతనం చేస్తున్నారు. ఒక టీం లా షాపుల్లోకి వెళ్లి అవి చూపించండి ఇవి చూపించండి అంటూ, అనుమానం రాకుండా దొంగతనం చేస్తున్నారు. నగర శివార్లలో షాప్ లో ఒంటరిగా ఉండే వారిని టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ఐదు ఆరు మంది ఒకే సారి షొప్ లోకి వస్తారు.

బట్టలు, బంగారు షాప్, బట్టల షాప్స్ లో మోడల్స్ చూస్తున్నట్లు నటిస్తారు. యజమాని ఏదైనా చూపిద్దామని వెనక్కి తిరగ్గానే ఓ ఐటెం తీసి దాచేస్తారు.. ఇటువంటి దొంగలు నగరంలో చాలామంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిని చూసి చిన్నపాటి షాపుల యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. గుంపుగా వచ్చేవారిని అసలు షాప్ లోకి కూడా రానివ్వడం లేదట. ఏంటని కస్టమర్లు ప్రశ్నిస్తే కరోనా నిబంధనలు ఉన్నాయి. గుంపులుగా రావద్దని చెబుతున్నారట.

మంచి బట్టలు ధరించి సంప్రదాయంగా షాపుల్లోకి వస్తుండటంతో దొంగలా కష్టమర్ల అనే విషయం గుర్తించలేక పోతున్నారు షాపుల యజమానులు. గతంలో ఇటువంటి దొంగలే కర్నూలు, చిత్తూరు జిల్లాలో పలు బంగారం షాపుల్లోకి వెళ్లి దోచుకున్నారు. సీసీ కెమెరాలు చూస్తే తప్ప వీరు దొంగతనం చేశారనే విషయం గుర్తించలేము. ఇటువంటి దొంగలను పట్టుకోవడం షాప్ యజమానులకు కొంచం కష్టమే. అందుకే ప్రతి ఒక్క షాప్ లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెబుతున్నారు పోలీసులు.

హైదరాబాదు లోని అల్కాపురిలో, సాయిబాబా గుడి వద్ద వున్న ఓ చీరల షాపులో జంటగా వచ్చిన చీరల దొంగలు దాదాపు ముప్పై వేల రూపాయలు విలువైన పట్టు చీరలను దొంగిలించారు. అది మొత్తం సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. అదే ఏరియాలో మరో షాప్ లో కూడా ఇటువంటి స్మార్ట్ దొంగతనము జరిగిందట.

నగరంలో నయా దొంగలు.. ఆదమరిస్తే అంతే సంగతులు