Hyderabad Metro : మెట్రో రైలులో గుండె తరలింపు

168

హైదరాబాద్ మెట్రో రైలులో గుండెను తరలించారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రో మార్గం ద్వారా గుండెను తరలించారు వైద్యులు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దింతో ఆ రైతు గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికీ అమర్చేందుకు సిద్ధమయ్యారు డాక్టర్లు.

ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్ మధ్య రోడ్డు మార్గంలో రావాలి అంటే ట్రాఫిక్ భారీగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వైద్యులు మెట్రో అధికారులకు విషయం తెలిపారు. వారు వెంటనే స్పందించి తాము సిద్దమే అని తెలిపారు. గుండె తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్న వైద్యులు మెట్రోలో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు తరలించారు. అనంతరం అపోలో సదరు వ్యక్తికీ చికిత్స చేసి గుండె అమర్చారు.

Hyderabad Metro : మెట్రో రైలులో గుండె తరలింపు