Hyderabad metro: నాగోల్ టు జూబ్లీహిల్స్ హార్ట్ జర్నీ..!

158

హైదరాబాద్ మెట్రో, హైదరాబాద్ పోలీస్, కామినేని, అపోలో ఆసుపత్రి వైద్యులు, అధికారులు మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించారు. మంగళవారం సాయంత్రం సమయంలో నాగోల్ నుండి జూబ్లీహిల్స్ వరకు మెట్రో హార్ట్ జర్నీ యావత్ నగర ప్రజలను ఆకర్షించింది. యాదాద్రి జిల్లాకు చెందిన నర్సి రెడ్డి అనే రైతు బ్రెయిన్ డెడ్ అయింది. ఆ రైతు అవయవదానానికి ఆయన కుటుంబం ఒప్పుకోవడంతో కామినేని ఆసుపత్రిలో నర్సి రెడ్డి గుండెను సేకరించారు. ఆ గుండెలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి అమర్చేందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.

నాగోల్ కామినేని నుండి జూబ్లీహిల్స్ అపోలో వరకు దాదాపు 28 కిమీ ఉంటుంది. ఎంత ట్రాఫిక్ క్లియర్ చేసినా కనీసం అర్ధగంట సమయం పడుతుంది. అందుకే హైదరాబాద్ మెట్రో అధికారులను సంప్రదించిన వైద్యాధికారులు మెట్రోలో గుండె తరలింపు గురించి వివరించారు. మెట్రో అధికారులు అందుకు ఒకే చెప్పడంతో జస్ట్ పదే పదే నిమిషాలలో నాగోల్ కామినేని నుండి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను చేర్చారు. ముందుగా మూడు నిమిషాలలో కామినేని నుండి నాగోల్ మెట్రోకు తరలించగా అయిదే నిమిషాలలో మెట్రోలో జూబ్లీహిల్స్ చేర్చారు.

జూబ్లీ మెట్రో స్టేషన్ నుండి అంబులెన్సులో జస్ట్ రెండు నిమిషాలలోనే ఆసుపత్రికి తరలించారు. నాగోల్ నుండి జూబ్లీ వరకు నాన్ స్టాప్ మెట్రోకి సహకరించిన మెట్రోకి వైద్యులు కృతజ్ఞత తెలపగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా హైదరాబాద్ పోలీసులు పగడ్బంధీ చర్యలు చేపట్టారు. మొత్తంగా గుండె తరలింపు విజయవంతంగా పూర్తిచేశారు. ఇక మిగిలింది అపోలోలో మరో వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స. ఈ ఘటనను చూసిన ప్రజలు దేవుని తరవాత దేవుడిగా భావించే వైద్యుల గొప్పదం ఏంటో ఇలాంటి సంఘటనతోనే రుజువవుతుందని మరోసారి గుర్తుచేసుకున్నారు.

Hyderabad metro: నాగోల్ టు జూబ్లీహిల్స్ హార్ట్ జర్నీ..!