బదిలీపై ఎమ్మార్వో స్పందన

155

కొద్దీ రోజుల క్రితం ఇన్కమ్ సర్టిఫికెట్ విషయంలో నాటి కార్పొరేటర్, నేటి మేయర్ విజయలక్ష్మి, షేక్ పేట ఎమ్మెర్వో శ్రీనివాస్ రెడ్డిని బెదిరించిన విషయం విదితమే.. అయితే కార్పొరేటర్ పదవి నుంచి మేయర్ పీఠం అలంకరించగానే ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ బదిలీ వెనుక మేయర్ విజయలక్ష్మి హస్తం ఉందని అందరు అనుకుంటున్నారు. కావాలనే మేయర్ శ్రీనివాస్ రెడ్డిని బదిలీ చేయించారని ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి..

ఇక ఈ బదిలీపై ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముందుగా విజయలక్ష్మి తనపై కేస్ పెట్టారు.. తర్వాత తాను కౌంటర్ పిటిషన్ వేసాను. తనకు అధికారికంగా ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందలేదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.. ఎందుకు ట్రాన్స్ఫార్ చేశారో తనకు తెలియదని మీడియాకు తెలిపారు.. బదిలీలు కామన్ గా జరుగుతాయి.. అలాగే అనుకుంటున్నా.. గొడవ జరిగిన రోజు.. కోర్ట్ కు వెళ్లాల్సి ఉండగా కేస్ స్టడీ చేస్తున్నాను. ఎక్కడ పని చేసినా.. సమర్ధంగా పని చేస్తాను. కామన్ మెన్ వచ్చినా స్పందిస్తాను అని ఎమ్మార్వో తెలిపారు. కాగా రెవెన్యూ సంఘాల నుంచి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు లభిస్తుంది.

బదిలీపై ఎమ్మార్వో స్పందన