22న మేయర్ గా బాధ్యతలు తీసుకోనున్న విజయలక్ష్మి

161

ఫిబ్రవరి 11న నగర మేయర్ ఎన్నిక పూరైన విషయం తెలిసిందే.. మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 22 న విజయలక్ష్మి మేయర్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. కాగా విజయారెడ్డి బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు.

ఈమె ఎంపీ కె కేశవరావు కూతురు. ఇక డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి తార్నాక నుంచి మొదటిసారి విజయం సాధించారు. మేయర్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే.. ఏ పార్టీకి సరైన బలం లేకపోవడంతో ఏ పార్టీకి చెందిన వారు మేయర్ అవుతారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.

22న మేయర్ గా బాధ్యతలు తీసుకోనున్న విజయలక్ష్మి