హైదరాబాద్ మేయర్ గా విజయలక్ష్మి

198

గ్రేటర్ మేయర్ ఉత్కంఠకు తెరపడింది జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ విజయ లక్ష్మీ మేయర్‌గా ఎన్నికయ్యారు. అదే పార్టీకి చెందిన మోతె శ్రీలత డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో ఎన్నిక నల్లూరుపై నడకె అయింది. ఇక మేయర్ పదవికి బీజేపీ తరపున రాధా ధీరజ్ రెడ్డి పోటీచేశారు. ఆమెకు 49 ఓట్లు వచ్చాయి. కౌన్సిల్ హాల్‌లో కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు చెయ్యి ఎత్తి తమ మద్దతు తెలిపారు.

ఎక్కువ మంది విజయ లక్ష్మీకి జైకొట్టడంతో ఆమె మేయర్‌గా ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి శ్వేతా మహంతి ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పోస్టుకు టీఆర్ఎస్ నుంచి మోతె శ్రీలత, బీజేపీ నుంచి రవి చారి పోటీ చేశారు. మెజారిటీ సభ్యులు శ్రీలతకు ఓటువేయడంతో ఆమె డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయినట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. ఇక ప్రమాణస్వీకారం తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో జరిగింది. 149 మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ ఎన్నికలో కార్పొరేటర్లతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొన్నారు.

విజయలక్ష్మి రెండోసారి బంజారాహిల్స్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2016 మేయర్ ఎన్నిక సమయంలో కూడా ఈమె పేరు తెరపైకి వచ్చింది. కేకే కూతురుగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన విజయలక్ష్మి జర్నలిజంలో డిగ్రీ చేశారు. 18 ఏళ్లపాటు అమెరికాలో ఉన్నారు. డ్యూక్స్ యూనివర్సటీలో సహాయ పరిశోధకురాలుగా పనిచేశారు. 2007 లో భారత్ కు తిరిగి వచ్చారు. ఆమె అమెరికా పౌరసత్వం వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక డెప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి తార్నాక కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఈమె మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డికి సోదరి.

హైదరాబాద్ మేయర్ గా విజయలక్ష్మి