జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

167

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగి రెండు నెలలు కావాల్సి వస్తుంది. మరో 15 రోజుల్లో పాత పాలకమండలి గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటన విడుదల చేశారు. కాగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను పరోక్ష పద్దతిలో ఎన్నిక నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ జిల్లా కలెక్టర్ ఎన్నికల పరిశీలకునిగా వ్యవహరించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ 11 న కుదరకపోతే మరుసటి రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. అయితే 12 సెలవుదినం, అయినాకూడా ఎన్నికల సంఘం అధికారులు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు సిద్దమే అని తెలిపారు. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పరిశీలకునిగా నియమించనుంది.

డిప్యూటీ మేయర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల