హైదరాబాద్ లో మరో దిశ ఘటన

80

హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ఆటోలో ఎక్కిన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడో ఆటో డ్రైవర్, యువతి ప్రతిఘటించడంతో ఆమెపై స్క్రూడ్రైవర్ తో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన చంద్రాయని గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పహాడీ షరీఫ్ లో ఫిరోజ్ అనే ఆటో డ్రైవర్ ఆటోలో ఎక్కిన యువతిపై లైంగికదాడియత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో స్క్రూడ్రైవర్ తో దాడి చేసి చంపేశాడు.

మృతి చెందిన యువతి మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా తగులబెట్టాడు. యువతిని గుర్తుపట్టకుండా ఉండేందుకు మొహంపై ఇటుకతో కొట్టి ఛిద్రం చేశాడు. చాంద్రాయణ గుట్టకు వెళ్లేందుకు రాత్రి 11 గంటల సమయంలో యువతి ఫాతిమా ఆటో ఎక్కగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఫిరోజ్ ను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

హైదరాబాద్ లో మరో దిశ ఘటన