కిలాడీ లేడి.. పోలీసులే టార్గెట్.. లక్షల రూపాయలు కాజేసింది

84

భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సహజం.. అయితే ఆ గొడవలు శృతిమించితే.. వేధింపులు ఎక్కువైతే ఆ భార్య భర్తలు విడాకులకే మొగ్గు చూపుతారు.. ఆలా భార్య పోడు భరించలేకనో, భర్త వేధింపులు పడలేకనో విడాకులు తీసుకున్న వారు సమాజంలో చాలామంది ఉన్నారు. వీరిలో కొందరు పిల్లలను తమ వద్దే ఉంచుకొని పోషణ నిమిత్తం ఎదో ఒక పని చేసుకొని జీవిస్తుంటారు. మరికొందరు అడ్డదారులు తొక్కుతారు. ఇలా అడ్డదారులు తొక్కిన మహిళ ఇప్పుడు కటకటాలపై జైల్లో ఊచలు లెక్కిస్తుంది..

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, వనస్థలిపురం నివాసం ఉండే శ్రీలత అనే మహిళకు 13 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు అయ్యాయి. ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసం ఉంటుంది. ఇద్దరు పిల్లలు కూడా ఈమెతోనే ఉంటారు. అయితే భర్తతో విడిపోయిన తర్వాత శ్రీలత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. కొన్నిరోజుల క్రితం ఆ వ్యక్తితో గొడవపడి తనను మోసం చేశాడని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇతడి ఒక్కడిమీదే కాదు.. వనస్థలిపురం ఎస్ఐ రామయ్య, నాగరాజుకు, రాజు అనే వ్యక్తులు భర్తకు దూరంగా ఉంటున్న తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని అబాండాలు వేసింది. అంతే కాదు రాజేందర్‌రెడ్డి అనే ఎస్సై అతని స్నేహితుడు మధుసూదన్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌పై కూడా కేసులు పెట్టింది. కేసు పెట్టాక.. వారితో ఆమె బేరానికి దిగుతుంది. ఆలా చాలామందితో ఇదే విధంగా వ్యవహరించి డబ్బులు గుంజింది. ఈమె మాయమాటలు నమ్మి ఆరుగురు పోలీస్ అధికారులు మోసపోయినట్లుగా తేలింది. ఇక బయటపడని కేసులు చాలా ఉన్నాయని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం శ్రీలత ఓ మహిళతో గొడవ పడింది.. ఈ గొడవ పెద్దది కావడంతో ఆ మహిళ శ్రీలతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టింది. దింతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని రిమాండ్ కు పంపారు. ఈజీ మనీ కోసం కొందరిని టార్గెట్ చేసుకుని వారిపై వేధింపుల కేసు పెట్టి ఇబ్బందిపెట్టిన శ్రీలత ఇప్పుడు ఇద్దరు పిల్లల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు.

కిలాడీ లేడి.. పోలీసులే టార్గెట్.. లక్షల రూపాయలు కాజేసింది