హైదరాబాద్ పేరు మార్చుతాం – మురళీధర్ రావు.

15403

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మార్చుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో అనేక నగరాల పేర్లు మారాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా నగరాల పేర్లు మార్చుతామని బీజేపీ నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చి తీరుతామని బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు అన్నారు. ఆదివారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ‘భారత్ నీతి’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘డిజిటల్ హిందూ కాంక్లేవ్’ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ పేరు మార్చే విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కేవలం పేరు మార్పే తమ ఉద్దేశం కాదని… సైద్ధాంతిక మార్పు కూడా తమ ఉద్దేశమన్నారు. దీనిపై ప్రజల్లో కూడా మద్దతు కూడగడతామన్నారు. కాగా ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలు, సినీ ప్రముఖులు, హిందూ సంఘాల నాయకులతోపాటు పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ కూడా హాజరయ్యారు.

హైదరాబాద్ పేరు మార్చుతాం – మురళీధర్ రావు.