పార్లమెంట్ క్యాంటిన్ లో హైదరాబాద్ బిర్యానీ ధర ఎంతో తెలుసా?

247

పార్లమెంట్ క్యాంటిన్ లో లభించే ఆహార పదార్ధాలపై సబ్సిడీ ఎత్తేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక కొత్త ధరలు జనవరి 29 తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక ప్రస్తుతం ఏ ఆహారపదార్ధం ధర ఎంత ఉందో ఓ సారి తెలుసుకుందాం. నాన్ వెజ్ బఫే ధర రూ. 700గా నిర్ణయించారు. క్యాంటిన్ మెనులో దీనిదే అత్యధిక ధర. ఇక చపాతీ అతి తక్కువ ధర పలుకుతుంది, రూ. 3 కె చపాతీ ఇవ్వనున్నారు.

హైదరాబాద్ మటన్ బిర్యాని రూ.150 రూపాయలుగా ధర నిర్ణయించారు. గతంలో రూ.65 కే ఇచ్చేవాళ్లు. శాకాహార భోజనానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఉడకబెట్టిన కూరగాయల ధరను రూ.50కి పెంచారు. గతంలో ఉడకబెట్టిన కూరగాయల ధర రూ. 12 ఉండేది. త్వరలోనే పార్లమెంట్ క్యాంటీన్‌లో సబ్సిడీని ఎత్తేస్తున్నట్లు జనవరి మొదట్లోనే స్పీకర్ ఓం బిర్లా చెప్పిన విషయం తెలిసిందే. ఈ సబ్సిడీని ఎత్తేయడం వల్ల లోక్‌సభ సెక్రటేరియట్‌కు ఏడాదికి రూ.8 కోట్లు మిగలనుంది. ఈ నిర్ణయాన్ని ఎంపీలు అందరు స్వాగతించారు.

పార్లమెంట్ క్యాంటిన్ లో హైదరాబాద్ బిర్యానీ ధర ఎంతో తెలుసా?