బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ

295

అమాయకులే వారి పెట్టుబడి.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటారు డబ్బులు వసూలు చేసి బోర్డ్ తిప్పేస్తారు. అమాయకులను నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని వ్యాపారం చేసి డబ్బులు గుంజి బోర్డు తిప్పేస్తుంటారు. ఇలా హైదరాబాద్ మహానగరంలో నిరుద్యోగులకు వలవేసి డబ్బు కాజేసి ప్లేట్ తిప్పేసిన కంపెనీలు కోకొల్లలు. ఇక తాజాగా మరో కంపెనీ ఇదే పంధాలో నడిచింది. ఫన్ లాబ్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన కొందరు.. బీటెక్ ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపారు.. వారి నుంచి డబ్బులు దండుకున్నారు సుమారు 200 మంది నుంచి ఉద్యోగాల పేరా డబ్బు లాగి నెలరోజుల్లోనే బోర్డు తిప్పేసి కనిపించకుండా పోయారు. గతంలో కూడా ఈ సంస్థ ఇలాగే చేసినట్టు.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో బాధితులు లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. పరారీలో ఉన్న యజమానిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక వీరి చేతిలో మోసపోయిన వారు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నారు.

బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్ వేర్ కంపెనీ