ఫార్మసీ విద్యార్థిని పోలీసులను కూడా బురిడీ కొట్టించింది.

247

బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కేసుపై శనివారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థినిపై అత్యాచారం అవాస్తవమని తెలిపారు. విద్యార్థిని అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేసిందని తెలిపారు. ఆటో డ్రైవర్లకు సీపీ క్షమాపణ చెప్పాడు. విద్యార్థిని, తన తల్లికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆమె బందువులకు ఫోన్ చేసి తెలిపిందని వివరించారు సీపీ. విద్యార్థిని చెప్పిన విషయాన్నే ఆమె బంధువులు పోలీసులు తెలిపారని. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థినిని గుర్తించారని చెప్పారు. మొదట బాలికను తాము విచారించినప్పుడు కూడా ఆటో వాళ్ళే కిడ్నాప్ చేశారని తెలిపిందని అన్నారు.

దింతో 60 మంది ఆటో డ్రైవర్లను పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. వారిలో నలుగురిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టామని వివరించారు. అయితే విచారణలో తాము తప్పు చెయ్యలేదని పదే, పదే ఆటో డ్రైవర్లు చెప్పడంతో తాము మరోసారి విద్యార్థిని ప్రశ్నిచామని తెలిపారు. రెండవసారి విచారణలో తెలిసిన వాళ్ళతోనే వెళ్లినట్లుగా విద్యార్థిని తెలిపింది. అయితే యువతి తన ఇష్టంతోనే వెళ్లినట్లు మహేష్ భగవత్ తెలిపారు. తన తల్లి పదే పదే ఫోన్ చేస్తుంటే ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారని తెలిపిందని మహేష్ భగవత్ తెలిపారు.

అయితే ఆమె ఎప్పటినుంచో తన ప్రియుడితో వెళ్లిపోవాలని చూస్తున్నట్లుగా యువతి పేర్కొన్నట్లు.. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ విధంగా ప్రియుడి బండిపై వెళ్లినట్లు వివరించారు. 6 నెలల క్రితం తన ఫ్రెండ్‌కి ఇంకో కిడ్నాప్ కథ చెప్పిందని సీపీ వెల్లడించారు. అమ్మాయికి కిడ్నాప్‌లు అంటే ఇష్టమని తెలిపారు. ఇప్పటికే విద్యార్థిని ప్రియుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు మహేష్ భగవత్. అయితే ఈ విద్యార్థిని మాత్రం పోలీసులను, కుటుంబ సభ్యులను దారుణంగా మోసం చేసిందని కొందరు మండిపడుతున్నారు.

ఫార్మసీ విద్యార్థిని పోలీసులను కూడా బురిడీ కొట్టించింది.