భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

414

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. తనతో కలిసి ఏడడుగులు నడిచిన భార్యనే కాటికి పంపాడో కసాయి భర్త. హత్య చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టాడు. పోలీసులు విచారణలో భర్తే హత్యచేసినట్లు నిర్దారణ కావడంతో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా మందిర మండలం ఏర్రుపాలెం గ్రామానికి చెందిన నాగశేషు రెడ్డి, నవ్యరెడ్డిలకు రెండు నెలల క్రితం వివాహం జరిగింది.

నాగశేషు రెడ్డి బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా నవ్యరెడ్డి (22) సత్తుపల్లి లో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. వీరిమధ్య ఏం జరిగిందే తెలియదు,, కానీ భార్యను మాత్రం హత్యచేశాడు. అనంతరం ఏర్రుపాలెం పోలీస్ స్టేషన్ కి వచ్చి తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. దింతో పోలీసులు నవ్య కోసం వెతికారు. శుక్రవారం కుక్కల గుట్ట సమీపంలో నవ్య మృతదేహం లభ్యమైంది.. దింతో ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు, వీరిద్దరూ బైక్ పై వెళ్తున్న వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది.

Husband Who Assassination Wife In Khammam District - Sakshi

దింతో పోలీసులు నాగశేషు రెడ్డిని తమదైన శైలిలో విచారించారు. దింతో తానే ఆ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.. గుట్ట ప్రాంతంలో నవ్యరెడ్డి మెడను చున్నీతో బిగించి హత్యచేసి చెట్ల పొదల్లో వేసినట్లుగా ఒప్పుకున్నాడు. ఆమెకు సంబందించిన బ్యాగులను కూడా మృతదేహానికి సమీపంలోనే వదిలి వెళ్ళాడు. ఇక నాగశేషు రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. కోటి ఆశలతో మెట్టింట అడుగుపెట్టిన కూతురు భర్త చేతిలో హత్యకు గురి కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

భార్యను దారుణంగా హత్య చేసిన భర్త