భూలోకంలో నాగలోకం

214

huge snakes found brejil kwimude iland : పాము అంటేనే ఒళ్లు జలదరిస్తుంది.. పాము కళ్లెదుటే కాదు, కలలో కనిపించినా భయంతో వణికిపోతారు. అలాంటిది ఒకేచోట కోట్లాది పాములు కనిపిస్తే ఇంకేమన్నా ఉందా..? భయంతో గుండె ఆగిపోదు.. పైగా ఆ సర్పాలు కూడా సాధారణవి కావు.. కాటేస్తే పైకి పోవడం తప్ప మరో దారి లేదు. ఇంతకీ ఏంటా పాముల కథ అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే బ్రెజిల్ లోని ఇల క్విముడే గ్రాండే దీవి పాములకు నిలయంగా మారింది. ఇక్కడే ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ‘గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్’ పాము ఈ దీవిలోనే మనుగడ సాగిస్తోంది. ఇక్కడ అడుగడుగునా  వేల సంఖ్యలో పాములు ఉంటాయి. పాములు తప్ప మిగతా జంతువులకు ఇక్కడ చోటు లేదు..

అయితే చిన్న చిన్న కీటకాలు మాత్రమే ఉంటాయి. ఆ కీటకాలు ఈ విషసర్పాలు ఆహరం. ఈ దీవి సముద్రానికి అంచున ఉంటుంది కాబట్టి ఇతర జంతువులు ఇక్కడ రావు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పాములే జీవనం సాగిస్తున్నాయి. వేల సంవత్సరాల కిందట ఈ దీవి ఎత్తైన నేలను కలిగి ఉంది కానీ క్రమంగా సముద్రం అంచు పెరిగిపోవడంతో చుట్టూ ఉన్న నేలంతా సముద్రంలో కలిసిపోవడంతో ఎత్తైన కొండ మాత్రమే మిగిలిపోయింది.. దాంతో అది కాస్త దీవిగా మారింది. ఇతర జంతువులు నివసించడానికి, అటువైపునకు రావడానికి వీలులేకుండా చేసింది ఈ నాగలోకం. శాటిలైట్ ద్వారా ఈ దీవి గురించి మానవసమాజానికి తెలిసింది.

భూలోకంలో నాగలోకం