విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం

59

విశాఖను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే ఉక్కు నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఉక్కు కర్మాగారంలోని సెకండ్ స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎమ్ఎస్)లో లాడిల్ కు ఉన్న కొక్కీలు ఒక్కసారిగా తెగిపోవడంతో ద్రవరూపంలో ఉన్న ఉక్కు భారీ మొత్తంలో కిందపడిపోయింది.

ఈ ఘటనలో ఉక్కు కర్మాగారం ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలు అయ్యాయి.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సమాచారమే అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని భారీగా ఎగిసిపడ్డ మంటలను అదుపుచేసింది. కాగా ఘటనలో సుమారు కోటి రూపాయుల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.