తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భారీ విరాళాలు!

392

కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన ఏడుకొండల ప్రత్యేకతల గురించి అందరికీ తెలిసిందే. కేవలం తెలుగు ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకన్నకు భక్తులు ఉన్నారు. వారి కోసం టీటీడీ కూడా వారి రాష్ట్రాలలో సేవాకార్యక్రమాలు.. కొన్ని రాష్ట్రాలలో వేంకటేశ్వరుని ఆలయాలను సైతం నిర్మిస్తుంది. ఆ వెంకన్నకు తెలుగు భక్తులు ఎందరు ఉంటారో తమిళులు అందుకు తక్కువేం కాదు. అందుకే టీటీడీ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తుంది.

తమిళనాడులోని ఉలుందుర్పేటలో నిర్మిస్తున్న ఈ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కుమారగురు 4 ఎకరాల స్థలం, నిర్మాణ ఖర్చులకు రూ 3.16 కోట్లు విరాళంగా అందించారు. తిరుమల గుబ్బ సత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి నగదు చెక్కులను అందించారు. ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలు, రూ 3.16 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే కుమారగురు అందజేశారు.

తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భారీ విరాళాలు!