లక్కు కలిసొచ్చింది.. గృహిణి కోటీశ్వరురాలు అయింది.

185

ధనం ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో తెలియదు.. ఎలా వెళ్లిపోతుందో కూడా తెలియదు.. కటిక పేదరోకంలో ఉన్నవారు కూడా తెల్లారేసరికి కోటీశ్వరులు అయిన సందర్భాలు ఉన్నాయి.. కోటీశ్వరులు కూడా కూటికి లేని వారీగా మారిన సందర్భాలు కోకొల్లలు. ఇలా ఒక్కరోజులోనే ఓ మహిళ కోటీశ్వరురాలైంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గృహిణిని వంద రూపాయలు కోటీశ్వరాలిని చేసింది. రేణు చౌహాన్ అనే మహిళ తన జీవితంలో తొలిసారి రూ.100తో పంజాబ్ స్టేట్ డియర్ 100+ మంథ్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 11న ప్రకటించిన ఫలితాల్లో ఆమె ఏకంగా రూ.కోటి గెలుచుకుంది. గురువారం ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌, సంబంధిత డాక్యుమెంట్లు అందించింది. కాగా రేణు చౌహన్ భర్త అమృత్‌సర్‌లో దుస్తుల దుకాణాన్ని నడుపుతున్నారు. ఈ లాటరీ టికెట్‌తో తమ అప్పులు తీరిపోతాయి. వ్యాపారానికి సైతం ఉపయోగపడతాయి” అని తెలిపింది.

లక్కు కలిసొచ్చింది.. గృహిణి కోటేశ్వరురాలు అయింది.