గాడిదలు, గుర్రాలకు పెరిగిన డిమాండ్

284

దేశంలో రాను రాను గాడిదల సంఖ్య తగ్గిపోతుంది. గుర్రాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇక గాడిదలనైతే ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విచ్చల విడిగా వధించి మాంసం అమ్ముతున్నారు. దింతో ఈ గాడిదలు, గుర్రాలు కనుమరుగై పోయే స్థితికి చేరుకున్నాయి. చూద్దామన్నా కనిపించడం లేదు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికారులకు గాడిదలు, గుర్రాలతో పనిపడింది.. దింతో వీటికోసం వారు ముమ్మరంగా గాలిస్తున్నారు. గాడిదలు పెంచేవారి కోసం ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, తమిళనాడులోని తేనిజిల్లాలో గల గిరిజన ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రి తరలించాలంటే సరైన రోడ్డు మార్గం లేదు.

వాహనాలు వెళ్లడం చాలా కష్టం.. దింతో ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు గాడిదలు, గుర్రాల అవసరం బడింది. దీనిపై చర్చించిన ఎన్నికల సంఘం అధికారులు, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు. ఎన్నికల సామాగ్రి తరలింపుకు గుర్రాలు, గాడిదలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. దింతో అధికారులు గాడిదలు, గుర్రాల కోసం వెతుకుతున్నారు. మొత్తం 30 గ్రామాలకు సామాగ్రి చేర్చాల్సి ఉండగా ఇప్పటి వరకు గాడిద, గుర్రం దొరకలేదట.. దింతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఎలాగైనా గాడిదలు, గుర్రాలను గుర్తించాలని తమకు తెలిసిన మరికొందరు అధికారులకు ఫోన్ చేసి వేడుకుంటున్నారట.. గాడిదల కోసం కర్ణాటకకు వెళ్లేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలుస్తుంది.

గాడిదలు, గుర్రాలకు పెరిగిన డిమాండ్