దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

84

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. కాగా దత్తాత్రేయ హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలం నుంచి గవర్నర్‌ దత్తాత్రేయ మరో వాహనంలో సూర్యాపేట బయల్దేరి వెళ్లారు.

 

దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం