యువకుడిని చితకబాదిన హిజ్రా.. దాడిలో తీవ్రగాయాలు

339

దొంగతనం చేశాడన్న నెపంతో ఓ యువకుడిని హిజ్రా చితకబాదింది.. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఈ ఘటన సిరిసిల్ల బస్సు స్టాండ్ లో చోటుచేసుకుంది. బస్టాండ్‌లో నిద్రిస్తున్న హిజ్రా జేబు నుంచి డబ్బులు దొంగిలించాడని ఆరోపణతో యువకుడిని హిజ్రా చితకబాదింది. తన ఫోన్, పర్సులో ఉన్న రూ.8వేలు అపహరించడాని ఆరోపిస్తూ హిజ్రా దాడి చేసింది. భూతులు తిడుతూ ఇష్టానుసారంగా దాడి చేసింది.

దింతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు వచ్చిన వారిని కూడా దూషించింది. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్టాండ్‎కి చేరుకుని యువకుడిని ఆస్పత్రికి తరలించారు. బస్సు స్టాప్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.