ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో ఊరట

136

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చిన విషయం విదితమే, అయితే ఈ తీర్పును సావల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా 2015లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు రాజాసింగ్ ప్రయత్నించారు.. ఈ సమయంలోనే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారనే అభియోగంపై విచారణ చేప్పట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. ఇదే కోర్టు ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. మంగళవారం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను కొట్టేసింది.

ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో ఊరట