మంచిర్యాల కలెక్టర్ కు హైకోర్టు నోటీసులు

179

తెలంగాణలో నిధుల దుర్వినియోగం వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో శ్మశానవాటికలో మొక్కలు పికి ఏకంగా 12 లక్షల బిల్లు కాజేశారు. ఈ వ్యవహారంలో అధికారులు ప్రజా ప్రతినిధుల హస్తం ఉన్నట్లుగా తెలిసింది. ఇక మంచిర్యాల జిల్లాలో రూ.90 లక్షల డీఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం అయినట్లుగా బీజేపీ నేతలు గురించి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హెలికేరి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నోటీసులు జారీచేసింది. మరోవైపు వీరిపై నిబంధనలకు విరుద్దంగా వెంచర్లు వేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.