భానుడి భగభగలు.. జనం బెంబేలు!

464

మార్చి మొదటి వారం నుండే ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను నమోదు చేసేలా దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండల తీవ్రత క్రమంగా పెరు‌గు‌తుంది. గత వారం నుండి క్రమంగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఆది, సోమ‌వా‌రాల్లో సాధా‌రణం కంటే మూడు డిగ్రీల మేర పెరిగే అవ‌కా‌శా‌లు‌న్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కా‌రులు హెచ్చ‌రిం‌చారు. శుక్ర, శని వారాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదివారం నుండి ఇది మరికాస్త పెరగనుందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలు‌ల‌తో గరిష్ఠ ఉష్ణో‌గ్ర‌తలు పెరు‌గు‌తున్నాయని అధికారులు తెలి‌పారు. తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉష్ణో‌గ్ర‌తలు పెరిగే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొ‌న్నారు. శని‌వారం ఆది‌లా‌బా‌ద్‌లో 38 డిగ్రీలు, భద్రా‌చ‌లంలో 38.5 , హన్మ‌కొం‌డలో 35, హైద‌రా‌బా‌ద్‌లో 37.2, ఖమ్మంలో 36.2, మహ‌బూ‌బ్‌‌న‌గ‌ర్‌లో 37.4, మెద‌క్‌లో 37 డిగ్రీలు, నల్ల‌గొం‌డలో 34.4 డిగ్రీలు, నిజా‌మా‌బా‌ద్‌లో 37.5 డిగ్రీలు, రామ‌గుం‌డంలో 37.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత రికా‌ర్డ‌యింది.

ఏపీలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారం నుండి ఇది మరికాస్త పెరగనుందని.. వేడి గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది వేసవి కాలం కరోనా లాక్ డౌన్ లో గడిచిపోగా ప్రజలు పెద్దగా ఎండకి ప్రభావితం కాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏడాది యధావిధిగా ప్రజా కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో ఎండ ప్రభావం ప్రజల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

భానుడి భగభగలు.. జనం బెంబేలు!