తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

1398

వరద సాయం పంపిణీలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ హైకోర్టుకు లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సాయం పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీఆర్ఎస్ నేతలు రూ. 10 వేలు పంపిణి చేశారని ఆరోపించారు శ్రవణ్. కాగా శ్రవణ్ లేఖను పిల్ గా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసికి నోటీసులు జారీ చేసింది. లేఖలోని వ్యాఖ్యలపై స్పందించాలని కోరింది. ఇక ఈ కేసు విచారణను సంక్రాంతి తర్వాత చేపడతామని తెలిపింది హైకోర్టు.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు