ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు

55

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలపై ‘ఎస్ఈసి’దే తుది నిర్ణయమని వ్యాఖ్యానించింది. ‘ఎస్ఈసి’నే ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు జారీ చేస్తారని పేర్కొంది.    ప్రభుత్వం నుంచి ముగ్గురు అధికారులు ‘ఎస్ఈసి’ని కలవాలని ఆదేశించింది. వారు కరోనాపై తాజా పరిస్థితిని వివరించాలని సూచించింది. సీనియర్ అధికారులతో సంప్రదింపుల తరువాత ఎన్నికలపై ఎస్ఈసి ఆదేశాలు జారీ చేస్తారని.. అయితే ఎస్ఈసి ఆదేశాలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు పేర్కొంది.