వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్

1507

మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా సోకినట్లుగా ఉదయం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అన్న చరణ్ తెలిపిన కొన్ని గంటలకే తమ్ముడు వరుణ్ తేజ్ తాను కూడా కరోనా బారినపడ్డానని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తనకు కరోనా లక్షణాలు లేవని వివరించారు. తనకు ఈ ఉదయం కరోనా పాజిటివ్ తేలింది అని, దింతో హోం క్వారెంటైన్ లోకి వెళ్ళిపోయానని పేర్కొన్నారు. ఇక తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయిన్చుకోవాల్సిందిగా కోరారు ఆయన. ఇక మెగా ఫ్యామిలీలో ఇద్దరికీ ఒకే రోజు కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగతా వారంతా టెస్ట్ లు చేయించుకునే పనిలో పడ్డారు.