కరోనా బారినపడ్డ రామ్, తల్లి, సోదరుడు.. చాలా భయమేసింది – రామ్

153

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. తరతమ బేధం లేకుండా పట్టేసుకుంటుంది. సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. చాలామంది మృతి చెందారు. ఇక తాజాగా హీరో రామ్ తల్లి, సోదరుడికి కరోనా సోకింది. ప్రస్తుతం వారిద్దరూ కోలుకున్నారు. ఇక ఇదే విషయంపై రామ్ శనివారం మీడియాతో మాట్లాడారు.

తన ఫ్యామిలీలో ఇద్దరికి కరోనా అని తెలిసి చాలా భయపడ్డాను. ముఖ్యంగా తన సోదరుడికి కరోనాక సంబంధించి తీవ్రమైన లక్షణాలు కనిపించాయని అన్నారు. అదృష్టవశాత్తు అతను పూర్తిగా కోలుకోగలిగాడని తెలిపారు. టీకా వచ్చే వరకు అందరం జాగ్రత్తగా ఉండడం మంచిదని రామ్ పేర్కొన్నాడు.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటింది. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మరణాలు కూడా చాల తక్కువగా నమోదవుతున్నాయి.

కరోనా బారినపడ్డ రామ్, తల్లి, సోదరుడు.. చాల బయమేసింది – రామ్