మాజీ ప్రధాని ఇందిరను కలవనున్న హీరో ప్రభాస్

78

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, చేతినిండా సినిమాలు పెట్టుకున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, కేజీఎఫ్ దర్శకుడి దర్శకత్వంలో వస్తున్న సలార్, తోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పేరు పెట్టని సినిమా ఒకటి ఉంది. ఈ నాలుగు సినిమాలతో ప్రభాస్ ఐదేళ్లు బిజీగా ఉంటారు.

ఇక ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ఆసక్తికరమైన సన్నివేశాల్లో కనిపించనున్నారు, రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో నటిసున్నట్లుగా సమాచారం

ఒక పాత్ర పీరియాడిక్ గా ఉంటే మరో పాత్ర ప్రస్తుత తరానికి సంబంధించినదిగా ఉంటుందట. పీరియాడిక్ పాత్రలో ప్రభాస్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కలవనున్నారట. ఇటీవలే దీనికి సంబంధించిన సీన్ ని చిత్రీకరించారట. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్, మాజీ ప్రధానిని ఎందుకు కలవనున్నారనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటి వరకు ఈ సినిమాపై ఒకస్థాయిలో ఉన్న అంచనాలు, మాజీ ప్రధానిని కలిసే సీన్ ఉందని తెలిసిన తర్వాత మరింత పెరిగాయనడంలో సందేహం లేదు.