హత్రాస్ అత్యాచార కేసులో సీబీఐ రిపోర్ట్ వెల్లడి.

91

ఈ ఏడాది సెప్టెంబర్ 14 న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగింది. అయితే మొదట హత్యాయత్నంగా కేసు నమోదు కాగా, బాదితురాలు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా సామూహిక అత్యాచారంగా తెచ్చారు. కాగా కొద్దీ రోజులకే అనగా సెప్టెంబర్ 28 న బాధితురాలు మృతి చెందింది..

ఆమె మృతి తర్వాత జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఇక హత్రాస్ కేసులో, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఒకలా వస్తే, వైద్యం అందించిన డాక్టర్లు తెలిపిన వివరాలు మరోలా ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెడితే, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా పోలీసులే ఖననం చేశారు. దింతో పెద్ద దుమారం చెలరేగింది. హత్రాస్ జిల్లా నిరసనలతో అట్టుడికిపోయింది. బాధితురాలికి మద్దతుగా దేశ వ్యాప్తంగా ఉద్యమం చేశారు.

ఇక ఈ నేపథ్యంలోనే కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హత్రాస్ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. అక్టోబర్ లో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ డిసెంబర్ 18 న నివేదిక ఇచ్చింది. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు తేల్చింది. అత్యాచారం అనంతరం దారుణంగా హత్య చేశారని వివరించింది. కాగా ఈ కేసులో నలుగురు యువకులను పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. సీబీఐ నివేదిక ఆధారంగా కోర్టు వీరికి శిక్ష వేసే అవకాశం కనిపిస్తుంది.

హత్రాస్ అత్యాచార కేసులో సీబీఐ రిపోర్ట్ వెల్లడి.