హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి దారుణ హత్య

171

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. రెండేళ్ల క్రితం యూపీలో సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటన బాధితురాలి తండ్రిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా హత్రాస్ అత్యాచారం కేసుపై ఎన్ఐఏ విచారణ చేస్తున్న సమయంలో ఈ విధంగా జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఈ తెల్లవారు జామున ప్రధాన నిందితుడు అతడి భార్య, అత్త గుడికి వెళ్లారు. ఇదే సమయంలో హత్యకు గురైన వ్యక్తి ఇద్దరు కుమార్తెకు గుడికి వచ్చారు. ఇక్కడే నిందితుడికి.. ఆ ఇద్దరు యువతులకు మధ్య గతంలోని కేసు విషయంలో వాగ్వాదం జరిగింది. విషయం తెలియడంతో యువతుల తండ్రి గుడిదగ్గరకు వచ్చాడు.. ఈ నేపథ్యంలోనే నిందితుడికి హత్రాస్ బాధితురాలి తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. దింతో అతడిని తుపాకీతో కాల్చి చంపినట్లుగా పోలీసులు చెబుతన్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలిపాడు. అవసరమైతే ఎన్ఐఏ కి అప్పగించాలని వివరించారు.

హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి దారుణ హత్య