రైతుల నిరసనపై నోరు విప్పిన దుశ్యంత్ చౌతాలా

72

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలంటూ 15 రోజులుగా రైతులు నిరసన తెలియచేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నిరసనపై గురువారం హర్యానా ఉప ముఖ్యమంత్రి, జన్‌నాయక్ జనతా పార్టీ అధినేత దుశ్యంత్ చౌతాలా స్పందించారు. రైతులకు కనీస మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చిందని అన్నారు.

రైతు సంఘాలు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాయని ఆయన గుర్తు చేశారు. తన నివాసంలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సహా కేబినేట్ సహచరులకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ ”రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం కూడా అందుకు ఒప్పుకుంది. అంతే కాకుండా బుధవారం వారికి లిఖిత పూర్వక హామీ కూడా ఇచ్చింది” అని దుశ్యంత్ చౌతాలా అన్నారు.