యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా హరీష్ కుమార్ ప్రమాణస్వీకారం

120

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం బీసీ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇటీవల బీసీ కార్పొరేషన్ చైర్మన్లు గా ఎంపికైన వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర యాదవ సంక్షేమ & అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా పులివెందులకు చెందిన హరీష్ కుమార్ యాదవ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. అందులో ఇలా పేర్కొన్నారు.

‘బీసీ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంకు విచ్చేసి నన్ను, నా తోటి బీసీ కులాల పాలకమండలి సభ్యులను ఆశీర్వదించిన బీసీ బంధుమిత్రులకు నా ధన్యవాదాలు. మీరు ఆశించిన విధంగానే శ్రీ వైఎస్ జగన్ గారి మార్గదర్శకత్వంలో యాదవుల అభివృద్ధికై పాటుపడతానని మాటిస్తున్నా..’ అంటూ హరీష్ కుమార్ యాదవ్ ట్వీట్ చేశారు.