CSKకి వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్

157

చెన్నై సూపర్ కింగ్స్ కు హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికారు. చెన్నై టీంతో తన బంధం ముగిసిందని తెలిపారు. బుధవారం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు హర్భజన్. ఆ టీమ్ తో ఆడడం గొప్ప అనుభవం. ఎన్నెన్నో అందమైన జ్ఞాపకాలను నా సొంతం చేసుకున్నా. ఎన్నోఏళ్ల పాటు గుర్తుంచుకునే గొప్ప స్నేహితులను చెన్నై టీం అందించింది. రెండేళ్ల పాటు నాకు అండగా నిలిచిన సీఎస్ కే యాజమాన్యానికి, సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు అని భజ్జీ ట్వీట్ చేశాడు.

కాగా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడిగా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్ 2018లో వేలంలో csk దక్కించుకుంది. రూ.2 కోట్లకు అతడితో ఒప్పందం చేసుకుంది. మొత్తంగా 160 మ్యాచ్ లు ఆడిన అతడు.. 150 వికెట్లు తీశాడు. 7.05 సగటుతో బౌలింగ్ చేశాడు. 137.22 స్ట్రైక్ రేట్ తో 829 పరుగులు చేశాడు. బౌలింగ్ తోపాటు చివరి ఓవర్లలో మెరుపు బ్యాటింగ్ చేసేవాడు బజ్జి. ఇక ఈ ఏడాది జరగనున్న వేలంలో బజ్జిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.