జీవీఎంసీ కమిషనర్ సృజన బదిలీ

293

విశాఖ జిల్లా : – జీవీఎంసీ కమిషనర్ సృజనను బదిలీ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆమె స్థానంలో ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ నాగలక్ష్మి నియామకం చెయ్యాలని తెలిపింది. ప్రభుత్వం ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేసింది. సృజన స్థానంలో నాగలక్ష్మికి బాధ్యతలు అప్పగించింది. కాగా ఇప్పటికే సృజన సెలవులో ఉన్నారు. మునిసిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ సృజన బదిలీ పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదిలా ఉంటే మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. అయితే దీనిపై అధికార పార్టీ నేతలు సుముఖత వ్యక్తం చేశారు.

మార్చి 12న కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. మార్చి 10వ తేదీ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రీ పోలింగ్ అవసరమైన చోట మార్చి 13న ఎన్నికలు జరుగుతాయి.

జీవీఎంసీ కమిషనర్ సృజన బదిలీ