టీఆర్ఎస్ కు షాక్.. పార్టీకి మాజీ డిప్యూటీ మేయర్

81

అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. కరీంనగర్ మాజీ మేయర్ గుగ్గిలపు రమేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ కు పంపారు రమేష్. ఇక అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. అధికార పార్టీకి మరికొందరు నేతలు రాజీనామా చేసే అవకాశం ఉందని సంజయ్ కు తెలిపారు రమేష్.

కాగా తాజగా జరిగిన కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో రమేష్ భార్య కార్పొరేటర్ గా విజయం సాధించారు. మాజీ డిప్యూటీ మేయర్ రాజీనామాతో అప్రమత్తం అయిన మంత్రి గంగుల కమలాకర్.. కీలక నేతలతో రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరూ ఆందోళన పడొద్దని.. కేసీఆర్, కేటీఆర్, తాను అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

 

టీఆర్ఎస్ కు షాక్.. పార్టీకి మాజీ డిప్యూటీ మేయర్