కాకినాడలో గుడికో గోమాత కార్యక్రమం

162

హిందూ ధర్మం విస్తృత ప్ర‌చారంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా గుడికో గోమాత కార్య‌క్ర‌మం నిర్వహిస్తోంది టీటీడీ.. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి దేవి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీ బాలా త్రిపురసుందరి దేవి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గోమాతను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కాకినాడ ఎంపీ వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.