దుమ్ములేపిన జీఎస్టీ వసూళ్లు

158

ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు సృష్టించాయి. కరోనా తర్వాత అత్యధికంగా జీఎస్టీ వసూలైంది. ఫిబ్రవరిలో స్థూల జీఎస్టీ రూ.1,13,143 కోట్లు వసూలు కాగా.. ఇందులో సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.21,092 కోట్లుగాను, రాష్ట్రాల జీఎస్‌టీ రూ.27,273 కోట్లు, ఇంటెగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ.55,253 కోట్ల చొప్పున ఉంది. రూ.9,525 కోట్లు సెస్సు రూపంలో సమకూరింది. జీఎస్‌టీ పెరుగుదల ఆర్థిక రికవరీని సూచిస్తోందని, నిబంధనల అమలు దిశగా పన్నుల అధికారులు తీసుకున్న ఎన్నో చర్యల ప్రభావం కూడా కనిపిస్తోందంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశీయ లావాదేవీలపై జీఎస్టీ 5 శాతం పెరిగింది కరోనా కారణంగా గతేడాది ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లకు పడిపోయిన విషయం తెలిసిందే.

దుమ్ములేపిన జీఎస్టీ వసూళ్లు