మోహన్ బాబుకు షాక్ ఇచ్చిన గ్రేటర్ అధికారులు

664

సినీ నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లోని తన ఇంటి ఆవరణలో సినిమా ప్రకటన బోర్డు ఏర్పాటు చేసి.. దానికి లైటింగ్ పెట్టడంతో లక్ష రూపాయల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు. నిర్దిశించిన ప్రమాణాలకు మించి ఉండటంతోనే ఈ జరిమానా విధించినట్లుగా అధికారులు చెబుతున్నారు. 15 అడుగుల ఎత్తున్న ఈ ప్రకటన బోర్డుకు లైటింగ్ కూడా పెట్టారు. దీనిని ఏర్పాటు చేసేందుకు అనుమతి కూడా తీసుకోలేదని చెబుతన్నారు అధికారులు. దింతో ఫైన్ విధించాల్సి వచ్చిందని వివరించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోహన్‌బాబు సన్నాఫ్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దేశ రక్షణ కోసం పోరాడే వ్యక్తిగా కనిపించనున్నాడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

మోహన్ బాబుకు షాక్ ఇచ్చిన గ్రేటర్ అధికారులు