ఏకగ్రీవమైతే భారీ నజరానా

117

పంచాయితీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం ఉండదు. వీరికి కేటాయించే గుర్తులు కూడా రాజకీయ పార్టీలకు చెందినవి ఉండవు. కేవలం ఆయా పార్టీలు అభ్యర్థులను బలపరుస్తాయి. ఇక ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల మొదటిదశ నామినేషన్ కు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఏకగ్రీవమైన పంచాయితీలకు భారీగా నజరానా ఇవ్వనుంది.

ఏకగ్రీవమైన పంచాయితీలకు గ్రామాభివృద్ధి కోసం రూ. 20 లక్షల రూపాయాల వరకు ప్రోత్సాహకం అందనుంది. పల్లెల్లో ఎన్నికలంటే ఖశ్చితంగా గొడవలు జరుగుతాయి. ఇటువంటివి కాకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవాలపై దృష్టిపెట్టింది. గ్రామీణుల సర్వశక్తులు అభివృద్ధికి దోహద పడాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మధ్య విభేదాలు పొడచూపకుండా ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖకు నిర్దేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.